: ప్రధాని మోదీకి లేఖ రాసిన కేసీఆర్


ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాశారు. హైదరాబాదులోని డీఆర్ డీవోకు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పేరు పెట్టాలని లేఖలో విన్నవించారు. హైదరాబాదుతో కలాంకు ఎంతో అనుబంధం ఉందని చెప్పారు. మన దేశ రక్షణ రంగం స్వయం సమృద్ధి సాధించడంలో హైదరాబాదులోని డీఆర్ డీవోలో జరిగిన పరిశోధనలు కీలకపాత్ర పోషించాయని తెలిపారు. ఇలాంటి గొప్ప సంస్థకు గతంలో డైరెక్టర్ గా పనిచేసిన కలాం పేరును పెట్టడం సముచితంగా ఉంటుందని లేఖలో విన్నవించారు. హైదరాబాదుకు డీఆర్ డీఎల్, ఆర్ సీఐ, ఐసీబీఎం, మిథాని వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలు రావడం వెనుక కలాం కృషి ఉందని చెప్పారు.

  • Loading...

More Telugu News