: ఏపీకి ప్రత్యేక హోదా కావాలని ప్రతి వ్యక్తి కోరుకుంటున్నారు... కేంద్రం న్యాయం చేయాలి: ప్రత్తిపాటి
ఏపీకి ప్రత్యేక హోదా కావాలని ప్రతి తెలుగు వ్యక్తి కోరుకుంటున్నారని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఈరోజు గుంటూరులో ఏపీ జర్నలిస్టుల ఫోరం నిర్వహించిన 'ప్రత్యేక హోదా - ఆంధ్రుల హక్కు' సదస్సుకు హాజరైన ఆయన ప్రసంగిస్తూ... ఏపీకి కేంద్ర ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు. ఇప్పటికే రాష్ట్రం ఆర్థిక లోటుతో ఉందని... లోటు భర్తీకి కేంద్రం సహకరించాలని అన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సైకిల్ ర్యాలీని మంత్రి ప్రారంభించారు. ప్రత్యేక హోదా కోసం ఈనెల 7న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయనున్నట్టు ఫోరం అధ్యక్షుడు కృష్ణాంజనేయులు, కార్యదర్శి వంశీ ఈ సందర్భంగా తెలిపారు.