: సంజయ్ దత్ కు బెయిలొచ్చింది
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కు ఊరట లభించింది! ఛీటింగ్ కేసులో ఆయనకు బెయిల్ మంజూరైంది. సంజయ్ దత్.. అండర్ వరల్డ్ డాన్ ల సాయంతో తన పట్ల బెదిరింపులకు పాల్పడుతున్నాడని షకీల్ నూరాని అనే నిర్మాత అంధేరి కోర్టులో ఫిర్యాదు చేశారు. దీంతో, కోర్టు సంజయ్ దత్ కు నేడు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2002లో 'జాన్ కి బాజీ' అనే చిత్రంలో నటించేందుకుగాను సంజయ్ రూ. 50 లక్షలు తీసుకున్నాడని, అయితే, తమ చిత్రం పూర్తి చేసేందుకు సంజయ్ దత్ సహకరించకపోగా, బెదిరింపులకు పాల్పడుతున్నాడని నూరాని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.