: ఫిలింనగర్ లో కలకలం సృష్టించిన ఆరేళ్ల చిన్నారి కిడ్నాప్


హైదరాబాదులోని ఫిలింనగర్ పరిధిలో ఆరేళ్ల చిన్నారి కిడ్నాప్ కు గురికావడం కలకలం సృష్టించింది. ఓ పాఠశాల ముందు ఆడుకుంటున్న చైతన్య హరిణి అనే బాలికను, అడ్రస్ చెప్పాలంటూ వచ్చిన ఓ గుర్తు తెలియని 21 సంవత్సరాల మహిళ అపహరించుకుపోయినట్టు తెలుస్తోంది. ఆకుపచ్చని చుడీదార్ వేసుకు వచ్చిన యువతి, పూజిత ఇల్లు ఎక్కడుంది? అని అడిగి, ఆ ఇల్లు చూపించాలని హరిణిని తీసుకెళ్లిందని సహ విద్యార్థులు తెలిపారు. కాగా, తమ కుమార్తె కిడ్నాప్ పై హరిణి తండ్రి కన్నీరుమున్నీరయ్యాడు. ఏమడిగినా ఇస్తామని, తమ పాపను క్షేమంగా తిరిగి ఇప్పించాలని కనపడిన వారందరి వద్దా మొరపెట్టుకుంటున్నాడు. రాత్రి నుంచి పాపను తలచుకుని ఏడుస్తున్నామని వాపోయారు. పాపకు హాని తలపెట్టవద్దని, తమ నుంచి ఏదైనా కోరుకుంటే, ఫోన్ చేయాలని సూచించాడు. కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

  • Loading...

More Telugu News