: నేడు ఫ్రెండ్ షిప్ డే... ఏ రంగు బ్యాండు దేనికి నిదర్శనమంటే..!


"స్నేహానికన్నా మిన్న లోకాన లేదురా" అని ఓ కవి అంటే, "స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం" అన్నాడు ఇంకో కవి. ప్రతి వ్యక్తికీ ఓ మంచి స్నేహితుడి అవసరం ఎంతైనా ఉంటుంది. కష్టాలను పంచుకోవడానికి, మదిలోని బాధను, ఆనందాన్ని వ్యక్త పరచడానికి స్నేహం ఎంతో సహకరిస్తుంది. నేడు ఫ్రెండ్ షిప్ డే. తమ ప్రాణ మిత్రులకు అభినందనలు చెప్పుకునే రోజు. తమ మధ్య స్నేహానికి నిదర్శనంగా ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకునే ఫ్రెండ్ షిప్ బ్యాండ్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. వివిధ రకాల రంగుల్లో ఇవి లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫ్రెండ్ షిప్ బ్యాండు రంగుల్లో విశిష్టతలు ఉన్నాయి. అవేంటంటే... * మీరు ఎరుపు రంగును ఎంచుకున్నారంటే ప్రేమకు, సంతోషానికి విలువను ఇస్తారని అర్ధం. మీకున్న శక్తికి నిదర్శనం. * ఆకుపచ్చ రంగును మీరు పట్టుకుంటే, ఆశ, అదృష్టాలకు ప్రతిరూపంగా నిలిచినట్టు. యవ్వనాన్ని కోరుకుంటారు. ప్రకృతిని ప్రేమిస్తారు. * నీలం రంగును ఎంపిక చేసుకుంటే, మీకు ప్రశాంతత అంటే ఇష్టం. ఎల్లప్పుడూ సోదర భావం ప్రదర్శిస్తుంటారు. * నలుపు రంగు నచ్చితే, మీకు ఒంటరిగా ఉండటం ఇష్టం. మదిలో ఏదో బాధ ఉందనడానికి కూడా ఇది నిదర్శనం. * పసుపు రంగు బ్యాండును ఎంచుకుంటే, ఇతరుల పట్ల ప్రేమను ప్రదర్శించాలని భావిస్తుంటారు. మీ వద్ద ఉన్న బంగారం, ధనాన్ని ఈ రంగు ప్రతిబింబిస్తుంది. * ఇక చివరిగా తెలుపు రంగును కోరుకుంటే, మీరు స్వచ్ఛంగా ఉండేందుకు యత్నిస్తుంటారు. ప్రశాంతంగా ఉంటారు. చల్లదనాన్ని కోరుకుంటారు.

  • Loading...

More Telugu News