: మరోసారి కాల్పులకు తెగబడ్డ పాకిస్థాన్
ఎప్పటికప్పుడు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ, భారత సైనిక శిబిరాలే లక్ష్యంగా కాల్పులు జరిపే పాకిస్థాన్ మరోసారి అదే పని చేసింది. జమ్మూ కాశ్మీర్ లోని భారత అంతర్జాతీయ సరిహద్దు సమీపంలోని ఆర్.ఎస్. పురా సెక్టార్ వద్ద కాట్ రంకా సైనిక శిబిరాలపై కాల్పులు జరిపింది. ఈ విషయాన్ని సైన్యాధికారులు వెల్లడించారు. పాక్ కాల్పులపై బీఎస్ఎఫ్ జవాన్లు స్పందించి ఎదురు కాల్పులకు దిగారని, శనివారం అర్ధరాత్రి 1.00 గంటకు మొదలైన కాల్పులు సుమారు గంటన్నర పాటు కొనసాగాయని తెలిపారు. ఈ ఘటనలో ఇండియాకు ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని స్పష్టం చేశారు.