: అత్యధిక మైలేజిని ఇచ్చేలా ఆల్టో డీజిల్ కారు వచ్చేస్తోంది!


ఈ ఏడాది డిసెంబరులో సరికొత్త ఆల్టో వేరియంట్ కారును విడుదల చేసేందుకు మారుతి సుజుకి ఏర్పాట్లు చేస్తోంది. ఇది ఇండియాలో, లీటరు ఇంధనంతో అత్యధిక మైలేజీని ఇచ్చే కారుగా నిలుస్తుందని సమాచారం. 2012లో మార్కెట్లోకి వచ్చిన ఆల్టో కారు పెట్రోల్ వేరియంట్ లో మాత్రమే లభిస్తుండగా, తాజాగా డీజిల్ ఇంజన్ తో ఈ కొత్త కారు రానుంది. దీనిలో సుజుకి అభివృద్ధి చేసిన 793 ట్విన్ సిలిండర్ ఇంజనును అమర్చినట్టు సంస్థ వర్గాలు వెల్లడించాయి. ఇదే ఇంజనును గత జూన్ లో విడుదల చేసిన సెలేరియో మోడల్ లో వాడారు. ఏఆర్ఏఐ పరీక్షల అనంతరం సెలేరియో లీటరుకు 27.62 కి.మీ. మైలేజిని ఇస్తుందని నిర్ధారించగా, దానితో పోలిస్తే ఆల్టో మరింత మెరుగైన గణాంకాలను అందుకుంటుందని ఆటో ఇండస్ట్రీ నిపుణులు భావిస్తున్నారు. కొత్త ఆల్టో ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ ఆప్న్ లో లభిస్తుందని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News