: రేణిగుంట బ్యాంకులో దోపిడీ!


రేణిగుంట సమీపంలోని సీఆర్‌ఎస్‌ సిండికేట్‌ బ్యాంకులో గత రాత్రి దోపిడీ జరిగింది. కొందరు దొంగలు బ్యాంకు తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లారు. బ్యాంకులో ఉన్న సీసీ కెమెరాలను ధ్వంసం చేసి దోపిడీకి పాల్పడ్డారు. దీన్ని గమనించిన కొందరు స్థానికులు ఇచ్చిన సమాచారంతో బ్యాంకు సిబ్బంది, పోలీసులు బ్యాంకు వద్దకు వచ్చారు. దోపిడీ జరిగిన తీరును పోలీసులు పరిశీలించారు. దుండగులు ఏ మేరకు దోచుకువెళ్లారన్న విషయంపై వివరాలు అందాల్సి వుంది. కేసు నమోదు చేసిన పోలీసులు దోపిడీ దారులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వీరు పాత నేరస్తులై ఉంటారని అనుమానిస్తున్నారు.

  • Loading...

More Telugu News