: తెలంగాణ సీఎం క్యాంపు కార్యాలయం ఎదుట వ్యక్తి ఆత్మహత్యాయత్నం


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాంపు కార్యాలయం ఎదుట నరసింహా అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. సకాలంలో పోలీసులు స్పందించబట్టి అతను ప్రాణాలతో బతికి బట్టకట్టాడు. మాజీ మంత్రి కుటుంబ సభ్యులు తన స్థలాన్ని ఆక్రమించుకున్నారని ఆరోపిస్తూ మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ కు చెందిన నరసింహా తెలంగాణ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ఎదుట పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునేందుకు ప్రయత్నించాడు. దీనిని గమనించిన పోలీసులు అతని ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. మాజీ మంత్రి బంధువులపై ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నిస్తే పోలీసులు పట్టించుకోవడం లేదని నరసింహా ఆవేదన వ్యక్తం చేశాడు.

  • Loading...

More Telugu News