: పార్లమెంటులో నేనాపదం వాడలేదు: షిండే


హిందూ తీవ్రవాదం అనే పదాన్ని పార్లమెంటులో తాను వాడలేదని కేంద్ర హోం శాఖ మాజీ మంత్రి సుశీల్ కుమార్ షిండే వివరణ ఇచ్చారు. యూపీఏ అధికారంలో ఉండగా, హిందూ తీవ్రవాదం అనే కొత్త పదాన్ని వాడుకలోకి తెచ్చిందని, అప్పటి నుంచి తీవ్రవాదంపై పోరులో తేడా వచ్చిందని పార్లమెంటులో కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై షిండే స్పందించారు. జైపూర్ లో జరిగిన ఓ సమావేశంలో మాత్రం 'హిందూ టెర్రరిజం' అన్నానని ఆయన తెలిపారు. ఆ తరువాత దానిని ఉపసంహరించుకున్నానని కూడా ఆయన తెలిపారు. రాజ్ నాథ్ సింగ్ చెప్పినట్టు పార్లమెంటులో తానెప్పుడూ ఆ పదాన్ని వాడలేదని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News