: భారత్ కు నవాజ్ షరీఫ్ క్షమాపణలు చెప్పాలి: యూత్ కాంగ్రెస్
పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ భారత్ కు క్షమాపణలు చెప్పాలని యూత్ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. ఢిల్లీలోని పాక్ హైకమిషన్ వద్ద ఆందోళన చేపట్టిన సందర్భంగా వారు మాట్లాడుతూ, మాజీ రాష్ట్రపతి దివంగత అబ్దుల్ కలాంపై పాక్ అణుశాస్త్రవేత్త ఏక్యూ ఖాన్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు, దీనానగర్ పై ఉగ్రవాదుల దాడికి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పాక్ హై కమిషన్ బంగ్లాలోకి దూసుకెళ్లేందుకు ఆందోళనకారులు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది.