: నాకు తెలుగు అభిమానులు చాలు!: మహేష్ బాబు


'నా స్టామినా గురించి నాకు తెలుస'ని మహేష్ బాబు చెప్పాడు. అప్పుడప్పుడు కలిసే అభిమానులు, మరికొంత మంది మిత్రులు తానేంటో చెబుతుంటారని మహేష్ బాబు నవ్వుతూ అన్నాడు. అయితే 'తానేదో గొప్ప' అని భావించడం లేదని చెప్పాడు. బాలీవుడ్ ప్రవేశం గురించి అడిగినప్పుడు 'నా భాషలో నన్ను ఆదరిస్తున్నప్పుడు నేను ఇంకెక్కడికో వెళ్లాల్సిన అవసరం ఏమిటి?' అని మహేష్ ఎదురు ప్రశ్నించాడు. దేశంలోనే అత్యధిక సినిమాలు నిర్మించే తెలుగు సినీ పరిశ్రమలో ఉండడం భాగ్యమని చెప్పాడు. ఎన్నో అద్భుతమైన సినిమాలు వచ్చిన తెలుగు సినీరంగంలో నిలదొక్కుకోవడం చాలని, ఇంకెక్కడికో వెళ్లడం ఎందుకని అడిగాడు. బాలీవుడ్ నుంచి అవకాశాలు వచ్చినా తెలుగులో సినిమాలు చేయడమే తనకు ఇష్టమని మహేష్ బాబు చెప్పాడు. తెలుగు అభిమానులు తనకు చాలని మహేష్ బాబు చెప్పాడు.

  • Loading...

More Telugu News