: కోహ్లీని ప్రశంసించిన ద్రవిడ్


టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీని దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ అభినందించాడు. టీమిండియాకు కోహ్లీ లాంటి ఆటగాళ్లు అవసరమని ద్రవిడ్ పేర్కొన్నాడు. శ్రీలంకతో జరగనున్న టెస్టు సిరీస్ లో ఎలా ఆడాలన్న విషయంలో ద్రవిడ్ సలహాలు తీసుకునేందుకు కోహ్లీ కలిసిన సందర్భంలో ఆయన ప్రశంసించాడు. ఈ నేపధ్యంలో కోహ్లీ సరైన దారిలోనే వెళ్తున్నాడని ద్రవిడ్ అభిప్రాయపడ్డాడు. పుజారాకు ఆటపై చక్కటి అవగాహన ఉందని ద్రవిడ్ తెలిపాడు. దురదృష్టవశాత్తూ ఈ రోజు అతను రనౌట్ అయ్యాడని, అయినా సత్తాచాటుతాడని విశ్వాసం వ్యక్తం చేశాడు. అంతర్జాతీయ టెస్టు మ్యాచ్ లలో స్పిన్ కీలకమని కోహ్లీకి సలహా ఇచ్చాడు. అలాగే క్రీజులో కుదురుకుంటే పరుగులు వాటంతట అవే వస్తాయని ద్రవిడ్ కోహ్లీకి చెప్పాడు.

  • Loading...

More Telugu News