: టీడీపీ పాలనలో ప్రజలు తృప్తిగా ఉన్నారు: బాబు
టీడీపీ పాలన పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంతృప్తిగా ఉన్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. విజయవాడలో వైఎస్సార్సీపీకి చెందిన 40 మంది స్థానిక నేతలు టీడీపీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇప్పటికిప్పుడు ఎన్నికలకు వెళ్తే ప్రతిపక్షాలకు 30 సీట్లు కూడా రావని అన్నారు. టీడీపీ ప్రజాసంక్షేమానికి కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. కష్టాల్లో అధికారం చేపట్టి సమర్థవంతంగా పరిపాలన చేపట్టామని ఆయన వెల్లడించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి బాటపట్టిస్తామని, ఇప్పటికే పలు కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయని ఆయన తెలిపారు.