: సాంకేతికపరమైన కారణాలతోనే కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వలేకపోతోంది: పురందేశ్వరి


ఏపీకి ప్రత్యేక హోదా లేదంటూ కేంద్రం స్పష్టం చేసినా... బీజేపీ నేతలు, ఎంపీల నుంచి సానుకూల అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం వెనక్కి పోలేదని ఆ పార్టీ నాయకురాలు పురందేశ్వరి తెలిపారు. సాంకేతికపరమైన కారణాలతోనే హోదా ఇవ్వలేకపోతోందన్నారు. హోదా ఇవ్వలేకపోయినా ఆ స్థాయిలో రాష్ట్రానికి సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరంలేదని 14వ ఆర్థికసంఘం సిఫారసు చేసిందని ఉద్ఘాటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని నిధులు అడిగినా ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉందని, నిధులు తెచ్చుకునే విషయంలో రాష్ట్రం మరింత చొరవ చూపాలని ఆమె సూచించారు. ఇదే అంశంపై బీజేపీ వ్యవహారాల ఇన్ ఛార్జి సురేంద్రనాథ్ సింగ్ మాట్లాడుతూ, రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై బీజేపీ కట్టుబడి ఉందన్నారు. అయితే హోదా ప్రకటించడానికి సాంకేతికపరమైన అడ్డంకులు ఉన్నాయని వివరించారు. బీజేపీ విధానాన్ని కేంద్రం అమలు చేస్తుందని తాము విశ్వసిస్తున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు. విభజన చట్టంలో రాష్ట్రానికిచ్చిన హామీలను కేంద్రం నెరవేరుస్తుందని ఎంపీ కంభంపాటి హరిబాబు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News