: నాన్నగారున్నారు... ఆయనుండగా ఆందోళన ఎందుకు?: శ్రుతి హాసన్


సినిమాల్లోకి వచ్చిన మొదట్లో తనపై చేసిన కామెంట్స్ కి ఆందోళన కలిగేదని శ్రుతి హాసన్ తెలిపింది. శ్రీమంతుడు ప్రమోషన్ లో భాగంగా ఓ టీవీ ఛానెల్ తో మాట్లాడుతూ, విమర్శలు ఎవరినైనా బాధపెడతాయని తెలిపింది. అయితే తనకు తన తండ్రి అండగా నిలబడ్డారని తెలిపింది. అన్నీ తెలిసిన తన తండ్రి ఉండగా అనవసరమైన ఆందోళన ఎందుకని ప్రశ్నించుకునే దానినని వెల్లడించింది. చేసేపని నిజాయతీగా చేసినప్పుడు ఫలితాన్ని పట్టించుకోకూడదని తన తండ్రి చెప్పారని చెప్పింది. సినీ రంగంలో ఆటుపోట్లు చూసిన ఆయన కంటే గొప్ప మాస్టారు అవసరం లేదని శ్రుతి హాసన్ తెలిపింది. కోలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ లో ఒకేసారి సినిమాలు చేస్తున్నా కష్టంగా లేదని శ్రుతి హాసన్ చెప్పింది. ట్రావెలింగ్ అంటే తనకు చాలా ఇష్టమని, షూటింగ్ ల కారణంగా ప్రయాణాలు చేస్తున్నానని, ఇష్టమైన పని చేస్తుంటే కష్టం ఏముందని ఎదురు ప్రశ్నించింది.

  • Loading...

More Telugu News