: మెట్రో రైలులో వికలాంగుల ప్రయాణానికి కొత్త టెక్నాలజీ


హైదరాబాద్ మెట్రో రైలులో వికలాంగుల ప్రయాణానికి కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టినట్టు మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నూతన టెక్నాలజీని తీసుకొచ్చామని చెప్పారు. రవీంద్రభారతిలో వికలాంగుల మాసపత్రిక 'పిలుపు' ఆధ్వర్యంలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఆయన పైవిషయాన్ని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఇంకా శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, ప్రభుత్వ సలహాదారు రమణాచారి, మంత్రి మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News