: కేసీఆర్ ను కలసిన కొండా దంపతులు... భర్తకు ఎమ్మెల్సీ సీటు ఇవ్వాలని కోరిన సురేఖ!
వరంగల్ ఎమ్మెల్యే కొండా సురేఖ, ఆమె భర్త మురళీ ఈరోజు సీఎం కేసీఆర్ ను క్యాంపు కార్యాలయంలో కలిశారు. వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీటు తన భర్త మురళికి ఇవ్వాలని సురేఖ సీఎంను కోరినట్లు తెలిసింది. అంతేగాక చాలా రోజుల తరువాత కొండా దంపతులు కేసీఆర్ ను కలవడం రాజకీయ నేతల్లో ఆసక్తి రేపుతోంది.