: ప్రత్యేక హోదా ఇచ్చేవరకూ ప్రయత్నాలను కొనసాగిద్దాం: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాపై టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు విజయవాడలో జరుగుతున్న పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో స్పందించారు. 14వ ఆర్థిక సంఘం నివేదిక ఆధారంగానే కేంద్రం లోక్ సభలో ప్రకటన చేసిందన్నారు. ప్రత్యేక హోదా విషయంలో ఏపీది ప్రత్యేక పరిస్థితని చెప్పారు. గత పాలకులు అసమగ్ర విభజన చేసి రాష్ట్రాన్ని నష్టాల్లోకి నెట్టారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే అన్ని రాష్ట్రాలతో సమానంగా పోటీపడే స్థాయి వచ్చే వరకూ కేంద్రం సహకరించాలని కోరారు. ఈ క్రమంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ప్రత్యేక హోదా ఇచ్చేవరకూ ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉందామని సమావేశంలో పార్టీ నేతలకు చంద్రబాబు పిలుపునిచ్చారు.