: విజయవాడలో టీడీపీ విస్తృత స్థాయి సమావేశం... నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం


టీడీపీ విస్తృత స్థాయి సమావేశం మరికాసేపట్లో విజయవాడలో ప్రారంభం కానుంది. నిన్న కేబినెట్ భేటీని నిర్వహించిన ఏసీ సీఎం నారా చంద్రబాబునాయుడు, నేడు టీడీపీ అధినేత హోదాలో పార్టీ శ్రేణులతో విస్తృత స్థాయి భేటీ నిర్వహిస్తున్నారు. నగరంలోని ఏ-1 కన్వెన్షన్ సెంటర్ లో జరగనున్న ఈ సమావేశానికి మంత్రులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ చార్జీలు హాజరుకానున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, తాజా రాజకీయ పరిస్థితులపై చంద్రబాబు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.

  • Loading...

More Telugu News