: గాంధీ ఆసుపత్రిలో 9 నెలల చిన్నారి కావ్య కిడ్నాప్... చిలకలగూడ పీఎస్ లో ఫిర్యాదు
హైదరాబాదులోని గాంధీ ఆసుపత్రిలో నేటి ఉదయం 9 నెలల చిన్నారి కావ్యను గుర్తు తెలియని మహిళ అపహరించింది. కావ్య తల్లిదండ్రులను ఏమార్చిన సదరు మహిళ కళ్లు మూసి తెరిచేలోగానే బాలికను ఎత్తుకెళ్లిపోయింది. కాస్త ఆలస్యంగా గుర్తించిన ఆమె తల్లిదండ్రులు రేణుక, ప్రవీణ్ సమీపంలోని చిలకలగూడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బాలిక కిడ్నాప్ పై వేగంగా స్పందించిన పోలీసులు గాంధీ ఆసుపత్రికి చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.