: బంజారాహిల్స్ లో కుర్రకారు బైక్ రేసింగ్ ల జోరు... 30 మంది అరెస్ట్
ఔటర్ రింగ్ రోడ్డు లాంటి విశాలమైన రహదారులపై పోలీసుల నిఘా పెరగడంతో బైక్ రేసర్లు నగరంలోని ప్రాంతాలకు షిఫ్టైపోయారు. సంపన్నుల ప్రాంతాలుగా పేరుగాంచిన బంజారాహిల్స్, జూబ్లిహిల్స్ లాంటి ప్రాంతాల్లో వీకెండ్ లలో యువత బైకులతో రెచ్చిపోతున్నారు. నిన్న రాత్రి పెద్ద సంఖ్యలో పోగైన యువకులు బంజారాహిల్స్ లో ఖరీదైన బైకులతో దూసుకుపోయారు. సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. దాదాపు 30 మందికి పైగా యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, బైక్ లను కూడా స్టేషన్లకు తరలించారు.