: ఐఎస్ దాడుల హెచ్చరికలతో అప్రమత్తమైన కేంద్రం...రేపు సమావేశం
ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు భారత్ పై దాడులకు తెగబడే ప్రమాదం ఉందంటూ నిఘా వర్గాల హెచ్చరికలతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దీంతో శనివారం ఉదయం పది గంటలకు సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో పాల్గోవాలంటూ 10 రాష్ట్రాల హోం శాఖ ప్రత్యేక కార్యదర్శులకు కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆహ్వానం పంపారు. ఈ సమావేశంలో ఐఎస్ఐఎస్ పై అనుసరించాల్సిన వ్యూహం, ప్రస్తుతం ఆయా రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులపై చర్చించనున్నారు.