: అసిస్టెంట్ డైరెక్టర్ పై కేసుపెట్టిన యువతి


వివాహం చేసుకుంటానని మభ్యపెట్టి ఉన్నదంతా ఊడ్చుకెళ్లాడని ఆరోపిస్తూ సినిమా అసిస్టెంట్ డైరెక్టర్ పై ఓ యువతి హైదరాబాదు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్ కోసం గాలిస్తున్నారు. వివరాల్లోకి వెళితే... గుంటూరు జిల్లా అచ్చంపేట మదిపాడు అగ్రహారం మండలం గింజుపల్లి గ్రామానికి చెందిన వల్లపునేని కృష్ణారావు (27) సినీ సహాయ దర్శకుడుగా పనిచేస్తూ, ఈవెంట్ మేనేజర్ గా వ్యవహరిస్తున్నాడు. ఓ ఈవెంట్ లో పరిచయమైన రోజా అనే అమ్మాయితో ప్రేమలో పడి, పెళ్లి చేసుకుంటానంటూ ఏడాది కాలంగా కృష్ణానగర్ లో సహజీవనం చేస్తున్నాడు. రెండు నెలలుగా అతని ప్రవర్తనలో మార్పు వచ్చింది. డ్రగ్స్ కు అలవాటు పడి, రోజాకు కూడా డ్రగ్స్ ఇచ్చి, దారుణంగా హింసించేవాడు. సిగిరెట్లతో కాల్చేవాడు. పీకల్దాక మద్యం తాగి, పళ్లతో కొరికేవాడు. మూడు రోజుల క్రితం రోజా నగలు, లక్ష రూపాయల నగదును తీసుకుని పరారయ్యాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. తన నుంచి దోచుకున్న డబ్బుతో నలుగురు మహిళలతో వివాహేతర సంబంధం కొనసాగించాడని ఆమె పేర్కొంది. కేసు నమోదు చేసిన పోలీసులు, కృష్ణారావు కోసం గాలింపు చేపట్టారు.

  • Loading...

More Telugu News