: ప్రత్యేకహోదాపై కేంద్రం ప్రకటన ఏపీకి వర్తించదు: ఏపీ కేబినెట్
విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ప్రత్యేక హోదాపై కేంద్రం ప్రకటనపై చర్చించారు. అయితే కేంద్రం చేసిన ప్రకటన దేశంలోని ఇతర రాష్ట్రాలకు వర్తిస్తుందని, కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి కాదని సర్దిచెప్పుకున్నారు. కాగా, పార్లమెంటులో కేంద్రం చేసిన ప్రత్యేకహోదా ప్రకటన ఆంధ్రప్రదేశ్ ను దృష్టిలో పెట్టుకుని చేసిందేనని అంతా పేర్కొంటున్న వేళ, ఆ ప్రకటన ఆంధ్రప్రదేశ్ కు వర్తించదని సాక్షాత్తూ ఏపీ కేబినెట్ అభిప్రాయపడడంపై ఇతర పార్టీలు ఎలా స్పందిస్తాయో చూడాలి.