: జేబులో పట్టే వాషింగ్ మెషీన్ వచ్చేసింది... స్నాప్ డీల్ లో మాత్రమే లభ్యం!
వాషింగ్ మెషీన్ ఎలా ఉంటుందో తెలిసిందే. కాస్తంత భారీగా ఉండి, ఇంట్లో బాగానే స్థలాన్ని ఆక్రమిస్తుంది. అయితే, హేర్ సంస్థ నుంచి కొత్తగా ఓ వాషింగ్ మెషీన్ వచ్చింది. దాని ప్రత్యేకత ఏంటంటే... ఎంచక్కా జేబులో పెట్టుకుని వెళ్లొచ్చు. పరిమాణం రీత్యా చాలా చిన్నది. అందుకే గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోనూ చోటు సంపాదించింది. ఆ మైక్రో వాషింగ్ మెషీన్ కు సంబంధించిన వివరాల్లోకెళితే... ఎలక్ట్రిక్ షేవర్ సైజులో ఉండే దీని పేరు 'కోడో'. భారత్ లో 'స్నాప్ డీల్' లో మాత్రమే లభించే దీని ధర రూ.3,900. ప్రయాణాల్లోగానీ, ఆఫీసులోగానీ దుస్తులపై ఏవైనా మరకలు పడినప్పుడు ఇది ఉపయుక్తంగా ఉంటుందని తయారీదారులు చెబుతున్నారు. దుస్తులపై పడ్డ మరకలను తక్కువ సమయంలోనే తొలగిస్తుందట. ఒక 'కోడో'తో 50 ఉతుకులు సాధ్యపడతాయని కంపెనీ వర్గాలు తెలిపాయి.