: రిషితేశ్వరి కుటుంబానికి పరిహారం... ఏపీ కేబినెట్ భేటీలో నిర్ణయం


ఆంధ్రప్రదేశ్ కేబినెట్ మీటింగులో విద్యార్థులపై సుదీర్ఘంగా చర్చించిందని మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. నాగార్జున యూనివర్సిటీలో ఆత్మహత్యకు పాల్పడిన రిషితేశ్వరి కుటుంబానికి 10 లక్షల రూపాయల పరిహారం చెల్లించనున్నట్టు ఆయన చెప్పారు. అలాగే విజయవాడలో వారి కుటుంబానికి 500 గజాల స్థలం ఇవ్వాలని నిర్ణయించినట్టు ఆయన వెల్లడించారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, యూనివర్సిటీల్లో కుల సంఘాలు రద్దు చేస్తున్నట్టు తెలిపారు. అలాగే, యూనివర్సిటీల్లో విద్యార్థులు ఆందోళనలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. యూనివర్సిటీల పేరు ప్రతిష్ఠలకు భంగం కలిగించే విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. యూనివర్సిటీలో బోధకులను నియమిస్తామని తెలిపారు. నాగార్జునా యూనివర్సిటీకి కొత్త వీసీగా సింహాద్రిని నియమిస్తే ఎలా ఉంటుందని చర్చించినట్టు ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News