: నలుగురు భారతీయులను ఐఎస్ఐఎస్ విడిచిపెట్టింది


లిబియాలో ఐఎస్ఐఎస్ చెరలో ఉన్న నలుగురు భారతీయులు విడుదలయ్యారు. భారత్ వస్తుండగా, ఓ చెక్ పోస్టు వద్ద తమ అదుపులోకి తీసుకున్న నలుగురు భారతీయ అధ్యాపకులను ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు విడిచిపెట్టారు. దీంతో వారు క్షేమంగా ఉన్నట్టు, ఐఎస్ చెర నుంచి విడుదలైనట్టు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో వారి కుటుంబ సభ్యులు ఆనందంలో మునిగిపోయారు. హైదరాబాద్, శ్రీకాకుళం, రాయచూరు, బెంగళూరుకు చెందిన నలుగుర్ని అదుపులోకి తీసుకోగానే భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. లిబియా అధికారులతో చర్చలు ప్రారంభించింది. విడుదలకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది. ఈలోగా వారు విడుదల కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

  • Loading...

More Telugu News