: ఇదీ మన రక్షణ విమానాల పని తీరు...మూడేళ్లలో 39 విమానాలు


భారత రక్షణ దళాలకు చెందిన విమానాల పని తీరు నానాటికీ తీసికట్టుగా మారుతోంది. గత మూడేళ్లలో 39 విమానాలు ప్రమాదానికి గురయ్యాయని రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్ పార్లమెంటుకు తెలిపారు. లోక్ సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన లిఖితపూర్వక సమాధానమిస్తూ, గత మూడేళ్లలో 39 రక్షణ శాఖ విమానాలు ప్రమాదానికి గురయ్యాయని అన్నారు. వీటిలో 14 హెలికాప్టర్లు కూడా ఉన్నాయని తెలిపారు. జరిగిన 39 విమాన ప్రమాదాల్లో 30 మంది వైమానిక అధికారులు మృత్యువాత పడ్డారని ఆయన సభకు చెప్పారు. కాగా, ఈ ప్రమాదాల్లో భారత వైమానికి దళానికే తప్ప సాధారణ పౌరులకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News