: చిల్డ్రన్ ఆర్ట్ గ్యాలరీగా మారనున్న కలాం అధికారిక నివాసం


మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం నివసించిన ఢిల్లీ, రాజాజీమార్గ్ లోని అధికారిక భవనం ఇకపై 'చిల్డ్రన్ ఆర్ట్ గ్యాలరీగా' మారబోతోందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వెల్లడించారు. కలాం నివాసాన్ని సందర్శించిన తరువాత ఆయన బంధువులు మార్గ్ ని ఆర్ట్ గ్యాలరీగా మార్చేందుకు అంగీకారం తెలిపారన్నారు. త్వరలో దానిపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని మీడియాతో చెప్పారు. అయితే పార్లమెంట్ విధి నిర్వహణ పట్ల గతంలో కలాం అసంతృప్తి వ్యక్తం చేశారన్నారు. కలాం మాటలను రాజకీయ నేతలంతా గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News