: 16 ఏళ్ల తరువాత అతిపెద్ద పతనం దిశగా బంగారం ధర!


బంగారం ధరలు తగ్గుతున్నాయి. ఇది అందరికీ తెలిసిందే. ఎంత కాలం నుంచి? వరుసగా ఆరు వారాల నుంచి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. 1999 తరువాత ఇలా వరుసగా ఆరు వారాల పాటు ధరల్లో తగ్గుదల నమోదు కావడం ఇదే తొలిసారి. అంటే 16 సంవత్సరాల తరువాత బంగారం ధరలు ఓ దీర్ఘకాల పతనాన్ని కళ్లజూస్తున్నాయన్నమాట. అంతేకాదు, రెండేళ్ల తరువాత అతిపెద్ద నెలవారీ పతనం కూడా నమోదైంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఫిబ్రవరి 2010లో 1,077 డాలర్ల వద్ద ఉన్న ఔన్సు బంగారం ధర, తిరిగి ఇప్పుడు, అంటే... సుమారు ఐదున్నరేళ్ల తరువాత అదే స్థాయికి చేరుకుంది. ఈ వారంలో ధర ఒక శాతానికి పైగా పడిపోయింది. మొత్తం మీద జూన్ 2013 తరువాత అతిపెద్ద నెలవారీ నష్టాన్ని నమోదు చేస్తూ, బంగారం ధర జూలైలో 7.5 శాతం మేరకు తగ్గింది. అమెరికా వృద్ధి గణాంకాల మెరుగు, యూఎస్ ఫెడ్ నిర్ణయాలపై ఆశలతోనే ఇన్వెస్టర్లు బులియన్ మార్కెట్ కు దూరంగా ఉన్నారని ఆర్గోనాట్ సెక్యూరిటీస్ అనలిస్ట్ హెలెన్ లూ వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News