: సెక్షన్ 8 అమలులో ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు: ఎంపీ రామ్మోహన్ నాయుడు
ఏపీ స్థానికత ఉన్న విద్యుత్ ఉద్యోగులను తెలంగాణ ప్రభుత్వం విధుల్లోకి తీసుకోకపోవడంపై ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసమే తెలంగాణ ప్రభుత్వం ఏపీ విద్యుత్ ఉద్యోగులను తొలగించిందన్నారు. అసలు సెక్షన్ 8 అమలులో ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. కోర్టు ఆదేశాలను టి.ప్రభుత్వం పాటించాలన్నారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తున్న విద్యుత్ ఉద్యోగులకు ఏపీ ఎంపీలు సంఘీభావం ప్రకటించిన సమయంలో ఎంపీ రామ్మోహన్ మాట్లాడారు.