: యాకూబ్ మెమన్ హత్యకు ప్రతీకారం: హెచ్చరించిన చోటా షకీల్


ముంబై బాంబు పేలుళ్ల కేసులో యాకూబ్ మెమన్ కు ఉరిశిక్ష అమలు చేసినందుకు దావూద్ ఇబ్రహీం గ్యాంకు ప్రతీకారం తీర్చుకోవచ్చని, ఒకప్పటి ఆయన అనుచరుడు చోటా షకీల్ వ్యాఖ్యానించాడు. ఇదే కేసులో నిందితుడిగా ఉండి తప్పించుకు తిరుగుతున్న చోటా షకీల్ 'టైమ్స్ ఆఫ్ ఇండియా'కు ఫోన్ చేసి మాట్లాడాడు. మెమన్ ఉరి ఘటనను దావూద్ సీరియస్ గా తీసుకున్నాడని తెలిపాడు. తన సోదరుడు టైగర్ చేసిన పాపాలకు మెమన్ బలయ్యాడన్న షకీల్, నిరపరాధిని దోషిగా చూపి ఉరేశారని ఆరోపించారు. ఈ ఉరికి ప్రతీకారం జరిగి తీరుతుంది, "వో తో హోగా హీ" అని అన్నాడు.

  • Loading...

More Telugu News