: ఏపీలో ఒక్కో మెడికల్ సీటును కోటి రూపాయలకు అమ్ముకుంటున్న ప్రైవేట్ కాలేజీలు... బ్లాక్ లిస్ట్ లో పెడతామన్న వైద్య మంత్రి


మెడికల్ కాలేజీల్లో బీ-కేటగిరీ సీట్లను ఒక్కొక్కటి కోటి రూపాయల వంతున అమ్ముకుంటున్నారన్న వార్తలు సంచలనం రేపుతున్నాయి. ఈ బ్లాక్ మార్కెటింగ్ పై సాక్షాత్తు ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడికల్ సీట్లను బ్లాక్ లో అమ్ముకుంటే సహించమని... అలాంటి కాలేజీలను బ్లాక్ లిస్ట్ లో పెడతామని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన నిర్దిష్ట ఫీజులకు కాకుండా, భారీ రేట్లకు సీట్లను అమ్ముకుంటున్నట్టు తమకు కూడా సమాచారం అందుతోందని... దీనిపై సీఐడీతో విచారణ జరిపిస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News