: షార్క్ కే షాకిచ్చిన సర్ఫర్!
సముద్ర తీరాల్లో సర్ఫింగ్ చేస్తున్న వారిపై షార్క్ చేపలు దాడి చేస్తున్న ఘటనలు ఇటీవలి కాలంలో పెరిగిపోయాయి. మొన్నటికి మొన్న ఓ సర్ఫర్ షార్క్ దాడి చేయబోతే, తృటిలో ప్రాణాలను కాపాడుకున్న ఘటన మరువక ముందే ఆస్ట్రేలియాలోని న్యూసౌత్ వేల్స్ లో మరో ఘటన జరిగింది. అయితే, ఇక్కడ సర్ఫర్ పారిపోయే పరిస్థితి లేదు. దీంతో ఎదురుతిరిగి షార్క్ పై పిడిగుద్దులు గుద్ది దాన్నే పారిపోయేలా చేశాడా సర్ఫర్. అతని పేరు క్రెయిగ్ ఐసన్. షార్క్ కూడా తన తోకతో ఎదురుదాడికి దిగడంతో ఐసన్ కు చేతులకు, కాళ్లకు గాయాలయ్యాయి. ధైర్యంగా షార్క్ కు పవర్ పంచ్ లను రుచి చూపించిన ఐసన్ ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.