: విజయవాడ కోర్టుకు కాల్ డేటా వివరాలు అందజేసిన సర్వీస్ ప్రొవైడర్లు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కాల్ డేటా వివరాలు ఎట్టకేలకు విజయవాడ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందుకు చేరాయి. కొద్దిసేపటి కిందట కాల్ డేటా వివరాలను సీల్డ్ కవర్ లో సర్వీస్ ప్రొవైడర్లు అందజేశారు. అనంతరం జరిగిన ఈ కేసు విచారణలో, సీల్డ్ కవర్ లో ఏమున్నాయో తెలిపేలా నోట్ ఫైల్ ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాదులు ప్రొవైడర్లను కోరారు. తిరస్కరించిన ప్రొవైడర్ల న్యాయవాదులు సుప్రీంకోర్టు ఆదేశించినట్టుగా సీల్డ్ కవర్ లోనే ఇస్తామని స్పష్టం చేశారు. మరోవైపు ప్రత్యేక మెసెంజర్ ద్వారా కాల్ డేటా వివరాలను హైదరాబాద్ లోని హైకోర్టు రిజిస్ట్రార్ కు ఇవ్వాల్సి ఉంది.