: మే 23 నుంచే టీడీపీ నేతల ఫోన్ల ట్యాపింగ్... తప్పు చేసింది కేసీఆరే: ఎల్.రమణ
ఫోన్ ట్యాపింగ్ అంశంపై తెలంగాణ ప్రభుత్వం తడబడుతోందని, ఆత్మరక్షణలో పడిపోయిందని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు. ఈ వ్యవహారంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆరే తప్పు చేశారని అర్థమవుతోందని చెప్పారు. తాము ఎవరి ఫోన్లను ట్యాప్ చేయలేదంటూ గతంలో టీఆర్ఎస్ నేతలంతా ఊదరగొట్టేశారని... ఇప్పుడేమో కోర్టులోనే ఒప్పుకున్నారని ఎద్దేవా చేశారు. మే 23వ తేదీ నుంచే టీడీపీ నేతల ఫోన్లు ట్యాప్ అయ్యాయని ఆరోపించారు. కాల్ డేటా ఇవ్వరాదంటూ తెలంగాణ ప్రభుత్వం ఎందుకు వాదిస్తోందని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తాను తవ్వుకున్న గోతిలో తానే పడిందని... ఫోన్ ట్యాపింగ్ కు మూల్యం చెల్లించక తప్పదని అన్నారు.