: రేపటి నుంచి తిరుమల పుష్కరిణి మూసివేత


తిరుమల శ్రీవెంకటేశ్వరునికి సెప్టెంబరు 16 నుంచి 24 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు, అక్టోబరు 14 నుంచి 22 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో నెల రోజుల పాటు ఆలయం పక్కనే ఉన్న ప్రధాన పుష్కరిణిని మూసి వేస్తున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. నిత్యమూ సాయంత్రం జరిపే పుష్కరిణి హారతిని కూడా తాత్కాలికంగా ఆపుతున్నట్టు వివరించింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా పుష్కరిణిని మరింత అందంగా చేసేందుకు మరమ్మతు పనులు ప్రారంభించాల్సిన కారణంగానే భక్తుల స్నానాలు నిలుపుదల చేసినట్టు టీటీడీ తెలిపింది. భక్తుల సౌకర్యార్థం పుష్కరిణికి పడమర దిక్కున స్నానాల గదులను ఏర్పాటు చేశామని పేర్కొంది.

  • Loading...

More Telugu News