: ఐ లవ్ యూ డాడీ... ఆత్మహత్యకు ముందు తండ్రికి రిషితేశ్వరి మెసేజ్


గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో సీనియర్ల వేధింపులకు తాళలేక ఆత్మహత్య చేసుకున్న బీఆర్క్ విద్యార్థి రిషితేశ్వరి ఘటనకు సంబంధించి పలు ఆసక్తికర అంశాలు వెలుగుచూస్తున్నాయి. నేటి ఉదయం రిషితేశ్వరి తల్లిదండ్రులు ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావును విజయవాడలో కలిశారు. ఈ సందర్భంగా ఆత్మహత్యకు ముందు రిషితేశ్వరి ‘ఐ లవ్ యూ డాడీ’ అంటూ తనకు పెట్టిన మెసేజ్ ను ఆమె తండ్రి మంత్రికి చూపించి కన్నీరు పెట్టుకున్నారు. తమ కూతురు ఆత్మహత్యకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రిషితేశ్వరి తల్లిదండ్రులు మంత్రికి విజ్ఞప్తి చేశారు.

  • Loading...

More Telugu News