: బెజవాడలో ఏపీ కేబినెట్ భేటీ షురూ... రాజధాని పరిధిలో తొలి భేటీ ఇదేనట!


ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం విజయవాడలో కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో నవ్యాంధ్రకు రాజధాని తరలింపుపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అంతేకాక అమరావతి నిర్మాణం ప్రారంభం, గుంటూరులో బీఆర్క్ విద్యార్థిని రిషికేశ్వరి ఆత్మహత్య, తెలంగాణ ప్రభుత్వం చేసిన ఫోన్ ట్యాపింగ్ తదితర అంశాలు ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశాలున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే, నవ్యాంధ్ర రాజధాని పరిధిలో కేబినెట్ భేటీ కావడం ఇదే తొలిసారి అట. ఇకపై కేబినెట్ భేటీలు ఇక్కడే నిర్వహించే అంశంపైనా చంద్రబాబు నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News