: అమరావతికి 'గేట్ వే'గా గన్నవరం
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి విజయవాడకు సమీపంలో ఉన్న గన్నవరం 'గేట్ వే'గా మారబోతోంది. గన్నవరంలోనే విమానాశ్రయం ఉండటంతో... అక్కడ నుంచి అమరావతి డౌన్ టౌన్ కు ఆరు లేన్ల రహదారిని నిర్మించనున్నారు. ఇక్కడే గేట్ వే పేరుతో ఒక ఆకర్షణీయమైన కట్టడాన్ని నిర్మించాలని భావిస్తున్నారు. మరోవైపు గన్నవరం సమీపంలోనే ఉన్న మేధా టవర్స్ ను సీఎం కార్యాలయం, ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు వాడుకోవాలని యోచిస్తున్నారు.