: రూటు మార్చిన టి.ఏసీబీ... స్వర నమూనాల కోసం స్పీకర్ కు లేఖ... అలాగే, టీవీ ఛానళ్లకు నోటీసులు


ఓటుకు నోటు కేసులోని నిందితులంతా కోర్టుకు వెళ్లి బెయిల్, స్టేలు తెచ్చుకుంటున్న నేపథ్యంలో తెలంగాణ ఏసీబీ రూటు మార్చింది. ముందు జాగ్రత్తతతో అడుగులు వేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో, టీటీడీపీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్యల స్వర నమూనాలను అందజేయాలని శాసనసభ స్పీకర్ మధుసూదనాచారికి లేఖ రాసింది. అలాగే, ఇతర నిందితులు సెబాస్టియన్, మత్తయ్యల స్వరనమూనాలను ఇవ్వాలని మూడు టీవీ ఛానళ్లకు కోర్టు ద్వారా నోటీసులు ఇచ్చింది. ఈ కేసులో నిందితులు స్వర పరీక్షకు సహకరించకపోవచ్చని ఏసీబీ భావిస్తోంది. నిందితులు సహకరించకుంటే ఇబ్బందులెదురౌతాయని, కేసు మొత్తం తలకిందులౌతుందని భావిస్తున్న ఏసీబీ... ముందస్తుగానే వారి స్వరనమూనాలను సేకరించి, అడ్మిటెడ్ స్వరాన్ని వాడుకోవాలని నిర్ణయించింది.

  • Loading...

More Telugu News