: వరుసగా ఐదో విక్టరీ... ప్రొ కబడ్డీలో దూసుకెళుతున్న తెలుగు టైటాన్స్


ప్రొ కబడ్డీలో తెలుగు టైటాన్స్ జైత్ర యాత్ర కొనసాగుతోంది. ఇప్పటికే లీగ్ లో నాలుగు వరుస విజయాలు సాధించిన ఈ జట్టు నిన్న రాత్రి పాట్నా పైరేట్స్ తో జరిగిన మ్యాచ్ లోనూ విజయదుందుభి మోగించింది. తాజా విక్టరీతో తెలుగు టైటాన్స్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. నిన్న హైదరాబాదులోని గచ్చిబౌలి స్టేడియంలో తెలుగు టైటాన్స్, పాట్నా పైరేట్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో తొలుత హోరాహోరీ పోరు సాగింది. అయితే ఆ తర్వాత తెలుగు టైటాన్స్ క్రమం తప్పకుండా ఒత్తిడి పెంచడంతో పాట్నా పైరేట్స్ కు పరాజయం తప్పలేదు. 34-22 స్కోరుతో తెలుగు టైటాన్స్ విజయం సాధించింది.

  • Loading...

More Telugu News