: ఆ దుర్మార్గులపై చర్యలు తీసుకోండి...బెజవాడలో గంటాతో రిషితేశ్వరి పేరెంట్స్ భేటీ


గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో సీనియర్ల వేధింపులకు తాళలేక ఆత్మహత్య చేసుకున్న బీఆర్క్ విద్యార్థిని రిషితేశ్వరి ఉదంతంపై నలుగురు సభ్యుల కమిటీ విచారణ దాదాపు చివరి దశకు వచ్చింది. ఈ నేపథ్యంలో రిషితేశ్వరి తల్లిదండ్రులు నేటి ఉదయం విజయవాడలో ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావును కలిశారు. తమ కూతురు ఆత్మహత్యకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు మంత్రిని కోరారు. విచారణ నివేదిక అందగానే బాధ్యులపై చర్యలకు ఉపక్రమిస్తామని ఈ సందర్భంగా మంత్రి గంటా వారికి హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News