: జస్టిస్ దీపక్ మిశ్రా... సమయపాలనకు కేరాఫ్ అడ్రెస్!


సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా సమయపాలనకు నిలువుటద్దంలా నిలుస్తున్నారు. ముంబై బాంబు పేలుళ్ల దోషి యాకుబ్ మెమన్ క్షమాభిక్ష పిటిషన్ పై సుప్రీంకోర్టు చరిత్రలోనే తొలిసారిగా అర్ధరాత్రి విచారణ జరిగింది. మొన్న అర్ధరాత్రి దాటిన తర్వాత 3.20 గంటలకు ప్రారంభమైన ఈ విచారణ తెల్లవారుజాము 4.50 గంటల దాకా హోరాహోరీగా సాగింది. మొన్న సాయంత్రం మెమన్ పిటిషన్ ను కొట్టివేసిన జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనమే ఈ పిటిషన్ ను విచారించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ ఎల్ దత్తు ఆదేశాల మేరకు జస్టిస్ మిశ్రా మరో ఇద్దరు న్యాయమూర్తులతో కలిసి సుప్రీంకోర్టు తలుపులను తెరిపించారు. మెమన్ తరఫు న్యాయవాదుల వాదనలను భారత అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ తిప్పికొట్టారు. ఇరువర్గాల మధ్య సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. విచారణ పూర్తయ్యేసరికి దాదాపు తెల్లారిపోయింది. అయినా నిన్న కోర్టు ప్రారంభమయ్యే సమయం (10.30 గంటలు)కే తిరిగి జస్టిస్ మిశ్రా విధులకు హాజరయ్యారు. రాత్రంతా నిద్రలేకపోయినా, ఆయన ఠంచనుగా సమయానికే బెంచీపైకి వచ్చేశారు.

  • Loading...

More Telugu News