: నేడు గురుపౌర్ణమి... సాయిబాబా ఆలయాలకు పోటెత్తిన భక్తులు


నేడు గురుపౌర్ణమిని పురస్కరించుకుని సాయిబాబా ఆలయాలు భక్తులతో పోటెత్తాయి. తెలుగు రాష్ట్రాల్లోని సాయిబాబా ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. దేశంలోనే కాక అమెరికా లాంటి దేశాల్లో ఏర్పాటైన సాయిబాబా ఆలయాల్లో నేటి తెల్లవారుజాముననే గురుపౌర్ణమి వేడుకలు ప్రారంభమయ్యాయి. న్యూజెర్సీలో ప్రవాసాంధ్రుల ఆధ్యర్యంలో ఏర్పాటైన సాయిబాబా ఆలయం భక్తులతో నిండిపోయింది. ఇక సాయిబాబా ప్రధాన దేవాలయం షిరిడీలో మూడు రోజుల పాటు జరగనున్న ప్రత్యేక కార్యక్రమాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరుకానున్నారు.

  • Loading...

More Telugu News