: జగన్, కేసీఆర్ తమ గొయ్యిని తామే తవ్వుకున్నారు: ఏపీ మంత్రి రావెల


ఫోన్ ట్యాపింగ్ అంశంపై ఏపీ మంత్రి రావెల కిశోర్ బాబు గురువారం ఘాటుగా స్పందించారు. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకునేందుకు జగన్, కేసీఆర్ కుట్ర పన్నారని ఆరోపించారు. రాష్ట్రాభివృద్ధి జరిగితే వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ గెలుస్తుందని కేసీఆర్ కు భయం ఆవహించిందని, రాష్ట్రం అభివృద్ధి చెందితే రాజకీయ భవిష్యత్ ఉండదని జగన్ కు భయం పట్టుకుందని అన్నారు. సర్వీస్ ప్రొవైడర్లు కోర్టుకు ఇచ్చిన నివేదికతో జగన్ లోనూ, కేసీఆర్ లోనూ భయం నెలకొందని తెలిపారు. కుట్ర ఫలితంగా జగన్, కేసీఆర్ తగిన మూల్యం చెల్లించుకోబోతున్నారని పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కారణంగా తెలంగాణ ప్రభుత్వం కుప్పకూలిపోబోతోందన్నారు. జగన్, కేసీఆర్ తమ గొయ్యి తామే తవ్వుకున్నారని రావెల ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News