: థరూర్ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదన్న కాంగ్రెస్
యాకూబ్ మెమన్ కు ఉరిశిక్షపై కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ చేసిన వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఆ వ్యాఖ్యలు థరూర్ వ్యక్తిగతమని, తమకు సంబంధం లేదని వివరణ ఇచ్చింది. పార్టీ అధికార ప్రతినిధి రణ్ దీప్ సింగ్ సూర్జీవాలా మాట్లాడుతూ... థరూర్ వ్యాఖ్యలను పార్టీ అభిప్రాయాలుగా పరిగణించరాదని స్పష్టం చేశారు. అంతకుముందు, మెమన్ ఉరితీతపై థరూర్ ట్విట్టర్లో కేంద్రంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇది కక్ష సాధింపు చర్య అని, ప్రతీకార చర్య అని దుయ్యబట్టారు. ప్రభుత్వం చేసిన హత్య అని మండిపడ్డారు. మరణదండనతో ప్రతికూల ఫలితాలే వస్తాయని, ఉరితీతలు ఉగ్రవాదానికి అడ్డుకట్ట వేయలేకపోయాయని పేర్కొన్నారు.