: తన ప్రయాణానికి అసౌకర్యం కలిగిందంటూ ఎతిహాద్ ఎయిర్ వేస్ పై కేసుపెట్టిన ప్రయాణికుడు
తన ప్రయాణానికి అసౌకర్యం కలిగించినందుకు ఎతిహాద్ ఎయిర్ వేస్ పై ఓ ప్రయాణికుడు కేసు పెట్టాడు. ఈ ఎయిర్ లైన్స్ కి చెందిన 2011 విమానం సిడ్నీ నుంచి దుబాయ్ వెళ్లింది. ఈ విమానంలో జేమ్స్ అనే ప్రయాణికుడి సీటు పక్కనే ఓ స్థూలకాయుడు కూర్చున్నాడు. అతను తీవ్రంగా దగ్గుతూ పక్కసీటులోకి ఒరిగిపోతూ జెమ్స్ కు తీవ్ర ఇబ్బంది కలిగించాడు. దీంతో తన సీటు మార్చాలని జేమ్స్ సిబ్బందిని కోరాడు. దానికి వారు నిరాకరించారు. అతని ఇబ్బంది తట్టుకోలేకపోయిన జేమ్స్ వెళ్లి వేరే క్యాబిన్ లో కూర్చున్నాడు. అయితే, అక్కడ కూర్చోకూడదంటూ సిబ్బంది జేమ్స్ ను వారించి, అతని సీట్లోనే కూర్చోమన్నారు. దీంతో దుబాయ్ వరకు ఇబ్బందిగా కూర్చుని ప్రయాణించడంతో జేమ్స్ కు నడుం నొప్పి వచ్చింది. ఎతిహాద్ విమాన సిబ్బంది తీరుతో తీవ్ర ఇబ్బంది పడిన జేమ్స్ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. న్యాయస్ధానం ఈ కేసును విచారణకు స్వీకరించింది.