: ప్రత్యేక హోదాపై ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తాం: వైఎస్సార్సీపీ


ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయాలని వైఎస్సార్సీపీ నిర్ణయించింది. ఆగస్టు 10న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టనున్నట్టు ఆ పార్టీ తెలిపింది. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు ధర్నా సాగుతుందని ఆ పార్టీ వెల్లడించింది. అనంతరం 'మార్చ్ టు పార్లమెంట్' నిర్వహించనున్నారు. ఈ ధర్నాలో వైఎస్సార్సీపీ అధినేత జగన్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ముఖ్యనేతలు పాల్గొంటారని ఆ పార్టీ పేర్కొంది.

  • Loading...

More Telugu News